ఆ ఇద్దరి మీద శృంగార కోరికలు పెరుగుతున్నాయ్.. నేను ‘గే’నా..?

by Bhoopathi Nagaiah |   ( Updated:2025-03-08 15:09:01.0  )
ఆ ఇద్దరి మీద శృంగార కోరికలు పెరుగుతున్నాయ్.. నేను ‘గే’నా..?
X

నా వయస్సు 16 సంవత్సరాలు.. నాకు మగ స్నేహితుల్లో ఒకరిమీద ఇష్టం కలుగుతోంది. నేను ‘గే’ నా అని భయంగా ఉంది. పరిష్కారం చెప్పగలరు?

- పి.ఎన్.వై హైదరాబాద్

టీనేజ్‌లో ఇటువంటి ఆకర్షణలు సహజమే. ఆడపిల్లల మీదే కాదు. సేమ్ సెక్స్ మీద కూడా ఆకర్షణ ఇష్టం కలుగుతాయి. అయితే, కాలం గడిచే కొద్దీ వారు (స్నేహితులు) మారి హార్మోన్స్‌లో మార్పులు వచ్చి అమ్మాయిల పట్ల ఆకర్షణ కలుగుతుంది. కొద్దిమందిలో సంవత్సరాలు గడిచినా అవే ఫీలింగ్స్ ఉండిపోయి మెల్లగా హోమో సెక్సువల్ సంబంధాల్లోకి వెళతారు. అయితే ఇది కొద్ది శాతం మాత్రమే. నువ్వు నీ మీద ‘హోమో సెక్సువల్’ ముద్ర వేసుకోకుండా అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరితో స్నేహం చెయ్యి. ఆ అబ్బాయి పట్ల నీ ఫీలింగ్స్‌కి ప్రాముఖ్యం ఇవ్వకు. ఒకవేళ తగ్గకపోతే కౌన్సెలర్ లేదా సైకోథెరపిస్ట్ సాయం తీసుకో.

- డాక్టర్ భారతి,

సెక్సువల్ హెల్త్ & ఫ్యామిలీ కౌన్సెలర్

ప్రీ & పోస్ట్ మేరేజ్ & సెక్సువల్‌ కౌన్సెలింగ్

For more Sex Education news

Next Story