'వెలుగు' వాట్సాప్ గ్రూప్ లో సెక్స్ వీడియో కలకలం.. పోస్ట్ చేసిన అధికారి

by Anukaran |   ( Updated:2021-08-13 00:01:25.0  )
apm officer news in chatrayi
X

దిశ, వెబ్‌డెస్క్: స్వయం సహాయక సంఘం మహిళలకు సమాచారం అందించేందుకు ఏర్పాటు చేసిన ‘వెలుగు’ వాట్సాప్ గ్రూప్ లో ఒక అశ్లీల వీడియో పోస్ట్ కావడం సంచలనం సృష్టిస్తోంది. అది కూడా ఒక అధికారి ఆ వీడియోను పోస్ట్ చేయడం ఇంకా రచ్చకు దారితీసింది. ఈ ఘటన కృష్ణాజిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. చాట్రాయి మండలంలోని కొందరు మహిళలు కలిసి ఒక డ్వాక్రా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి సంబంధించిన సమాచారం అందించేందుకు ఏర్పాటు చేసిన వెలుగు వాట్సాప్ గ్రూపులో వీరు కూడా చేరారు. ఈ గ్రూపులో ‘వెలుగు’ ఏపీఎం బాలసుబ్రహ్మణ్యం లోన్స్, పథకాలకు సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక గురువారం కూడా ‘వెలుగు’ వాట్సాప్ గ్రూప్ లో ఒక వీడియో పోస్ట్ అయ్యింది.

డ్వాక్రాకు సంబంధించిన వీడియో అనుకోని ఓపెన్ చేసిన వారికి చుక్కలు కనిపించాయి. ‘వెలుగు’ గ్రూప్ లో ఓ ‘నీలి’ వీడియో ప్రత్యక్షమయింది. దీంతో ఒక్కసారిగా మహిళలు ఖంగుతిన్నారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన ‘వెలుగు’ ఏపీఎం బాల సుబ్రహ్మణ్యంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వీడియో పోస్టు కావడంపై బాల సుబ్రహ్మణ్యం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. ఇది పొరపాటున జరిగిందని, తాను కావాలని చేసింది కాదని తెలిపారు. తనకు ఎవరో పంపిన వీడియో పొరపాటున అందులో పోస్టు అయ్యిందని, కొందరు కావాలనే తనను అప్రతిష్ఠ పాలుచేసేందుకు ఆ వీడియోను ఇతరులకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వార్త చాట్రాయిలో వైరల్ గా మారింది.

Read More:

మార్నింగ్ వాక్‌కు వెళ్లిన బీజేపీ అధ్యక్షుడిపై దాడి..

టీఆర్ఎస్ నేతల కొట్లాట.. డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లపై కర్రలతో దాడి..!

Advertisement

Next Story