- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కామ కోర్కెలు తీర్చలేదని.. కాళ్లు చేతులు నరికి అలా చేశాడు!
దిశ, వెబ్‌డెస్క్ : కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు వయసు, వరసతో సంబంధం లేదనుకుంటున్నారు. ఓ వైపు తోబుట్టులపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే.. మరోవైపు నెలలు నిండని పసిబిడ్డ నుంచి పండుటాకులైన వృద్ధురాళ్లపై కూడా లైంగిక దాడులు చేస్తూ పైశాచికత్వానికి పాల్పడుతున్నారు. ఆ సమయంలో ఎదురు తిరిగినా.. గుర్తుపట్టినా నిర్ధాక్షిణంగా అంతమొందిస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ వృద్ధురాలిని తన కామ కోర్కెలు తీర్చలేదని ముక్కలు ముక్కలుగా నరికేశాడో కామ పిశాచి.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో గత 15 రోజుల క్రితం ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. కేవలం మొండెం మాత్రమే పోలీసులకు దొరికింది. కాళ్లు, చేతులు, తలను దుండగులు నరికి తీసుకెళ్లారు. గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీఐ శ్రీనివాసులు ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్నారు. హత్య స్థలంలో దొరికిన ఆనవాళ్లు, క్లూస్ ఆధారంగా ఈ కేసును ఛేదించారు.
హతురాలిని కారెపల్లి మండలంలోని భజ్యాతండాకు చెందిన యాచకురాలు నాజీగా గుర్తించారు. ఆ వృద్ధురాలిపై కన్నేసిన అదే తండాకు చెందిన ఉపేందర్.. తన కామకోర్కెలు తీర్చాలని పట్టుబట్టాడు. దానికి నాజీ ఒప్పుకోకపోవడంతో ఆగ్రహం చెందిన ఉపేందర్ ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మాయం చేయడానికి ఆయన భార్య అనసూయ, కొడుకు కేశవరావు సహకారం తీసుకున్నాడు.
నాజీ కాళ్లు, చేతులను నరికి వాటిని స్థానికంగానే దహనం చేశారు. అనంతరం తలను తరికేసి ఖమ్మం ఎన్ఎస్పీ కాలతో పడేశాడు. తల, కాళ్లు, చేతులు లేని మృతదేహాన్ని ఎదరు గుర్తించరనే నమ్మకంతో నిందితులు ఉన్నారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి హంతకుడిని గుర్తించారు. అతడికి సహకరించిన భార్య, కుమారుడిని సహ ముగ్గరిని అరెస్ట్ చేశారు.