రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సజీవదహనం

by Anukaran |
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సజీవదహనం
X

దిశ, వెబ్‎డెస్క్: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సురేంద్రనగర్‎లో కారును డంపర్ ఢీ కొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చేరి అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు సజీవ దహనమయ్యారు. చోటిలమాత దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed