ఏడుగురి ప్రాణాలు తీసిన ప్రాణవాయువు

by vinod kumar |
ఏడుగురి ప్రాణాలు తీసిన ప్రాణవాయువు
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో వారికి బెడ్లు, ఆక్సిజన్ సరిపడా అందడం లేదు. ఇప్పటికే దేశంలో ఆక్సిజన్ అందక చాలా మంది మృతి చెందారు. మహారాష్ట్ర, ఢిల్లీ, ఏపీ, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు వెలుగుచూశాయి.

ప్రాణవాయువు అందక ఎక్కడివారు అక్కడే కుప్పకూలిన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా ఆక్సిజన్ అందక ఏడుగురు కరోనా బాధితులు మృతి చెందారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ నిల్వలు మోతాదుల లేవని బంధువులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం మరోసారి వెలుగుచూసింది. ఇటీవలే చెంగల్ చెట్టు ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ అందక 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story