- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు..
దిశ, తెలంగాణ బ్యూరో : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులను నియమించాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇందులో మహిళా న్యాయమూర్తులే నలుగురు ఉన్నారు. మొత్తం ఏడుగురిలో ఆరుగురు జ్యుడీషియల్ అధికారులు కాగా, ఒకరు ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ నుంచి వస్తున్నారు. కొత్తగా వస్తున్న ఏడుగురితో కలిపి ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్య 20కి చేరుకుంటుంది.
తెలంగాణ హైకోర్టుకు తొలుత 14 మంది జడ్జీ పోస్టులు మంజూరు కాగా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జస్టిస్ ఎన్వీ రమణ ఆ సంఖ్యను 42కు పెంచారు. అయితే ఆ మేరకు న్యాయమూర్తుల నియామకం ఇంకా జరగలేదు. 14 మంది జడ్జీలతోనే హైకోర్టు పనిచేస్తున్నది. ఇటీవలే ఒక జడ్జీ బదిలీపై వెళ్ళిపోవడంతో ప్రస్తుతం 13 మంది మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏడుగురు జడ్జీలను నియమించేలా కొలీజియం సిఫారసు చేయడంతో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 20కి చేరుకోనున్నది.
తెలంగాణ హైకోర్టుకు వస్తున్న న్యాయమూర్తుల వివరాలను పరిశీలిస్తే.. సుమలత, సుధ, రాధారాణి, లక్ష్మణ్, తుకారాంజీ జ్యుడిషియల్ అధికారులుకాగా, మాధవీలత ఆదాయపు పన్ను శాఖ అప్పీలేట్ ట్రిబ్యునల్ నుంచి వస్తున్నారు. వీరు కూడా విధుల్లో చేరిన తర్వాత తెలంగాణ హైకోర్టుకు ఇంకా 22 మంది జడ్జీల కొరత ఉంటుంది. హైకోర్టు పరిధిలో ఉన్న క్రిందిస్థాయి కోర్టుల్లో మొత్తం జడ్జీల సంఖ్య 474 కాగా ఇంకా 96 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.