- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెటిల్‌మెంట్ కింగ్.. ఆయన గుప్పిట్లో పోలీసులు ఉన్నారట..?
దిశ ప్రతినిధి, కరీంనగర్ : సీఎంఓలోని పెద్దలతో పరిచయాలున్నాయంటూ ఓ వ్యక్తి కరీంనగర్ లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. కొంతకాలం క్రితం హైదరాబాద్లో ఓ భూదందాలో ఇన్వాల్వ్ అయిన సదరు వ్యక్తికి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులతో పరిచయాలు ఏర్పడ్రాయని ప్రచారం జరుగుతోంది. పోలీసు అధికారులతో కూడా సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకుని జిల్లాలో ఇసుక దందాను కూడా ప్రోత్సహించాడనే ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీలోని ఇద్దరు ముఖ్య నాయకులు తనతో టచ్లో ఉంటారని చెప్తూ కరీంనగర్ లోని కొంతమంది పోలీసు అధికారులతో దోస్తానా చేస్తున్నాడని, పట్టణ శివార్లలో తన కంట్రోల్లో ఉండే రెండు గెస్ట్హౌజ్లలో అసాంఘిక కార్యకలాపాలు సైతం నిర్భయంగా కొనసాగిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ కు చెందిన కొంతమంది పోలీసు అధికారులు సదరు వ్యక్తితో సంబంధాలు పెంచుకోవడంతో ఆయనను అడ్డుకునే వారే లేకుండా పోయారని అంటున్నారు కరీంనగర్ వాసులు. అంతేకాదు కాస్ట్ లీ కారుల్లో తిరుగుతూ.. ఇద్దరు ప్రైవేటు గన్ మెన్లను సైతం ఏర్పాటు చేసుకుని దర్జాతనం వెలగబెడుతున్నాడు.
వెపెన్స్ లైసెన్స్ కోసం..
లైసెన్స్ డ్ వెపన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆ వ్యక్తికి కరీంనగర్ కు చెందిన ఓ పోలీస్ అధికారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే ప్రస్తుతం ఉన్న సీపీ కమలాసన్ రెడ్డి బదిలీపై వెళ్లిపోయిన తరువాత అన్నీతానై ఆయుధ లైసెన్స్ చక్కబెడ్తానని మాటిచ్చి.. ఆ ఆఫీసర్ ఫైల్ కూడా తనవద్దే ఉంచుకున్నారని సదరు వ్యక్తి ప్రచారం చేసుకుంటుండడం గమనార్హం.
పోలీసులు సైతం..
తనకున్న ఇమేజ్ తో సెటిల్ మెంట్లు కూడా చేస్తానని ప్రచారం చేసుకుంటున్న ఆ వ్యక్తి.. తాజాగా అనుకున్న ప్రదేశానికి బదిలీలు చేయిస్తాడని కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని పెద్ద తలకాయలే ఆయన చేతిలో ఉన్నాయని అధికారులు నమ్మడాన్ని చూసిన కింది స్థాయి ఉద్యోగులు కూడా అనుకూలమైన పోస్టింగ్ల కోసం అతని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. పోలీసు డిపార్ట్ మెంట్ తోనే కాకుండా రెవెన్యూ విభాగానికి చెందిన వారిని కూడా తన గుప్పిట పెట్టుకుని లావాదేవీలు కొనసాగిస్తున్నారన్న, ఫైనాన్స్ సెటిల్మెంట్లలో కూడా తలదూర్చుతున్నాడని ప్రచారం.