- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టాప్ సీడ్ ఆటగాళ్ల ముందంజ
దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్ సోమవారం మెల్‌బోర్న్‌లో ప్రారంభమైంది. తొలి రౌండ్ మ్యాచ్‌లలో సెరేనా విలియమ్స్, నయోమీ ఒసాకా, థీమ్, జకోవిచ్ వంటి టాప్ సీడ్ ఆటగాళ్లు అలవోకగా గెలిచి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. రాడ్ లావెర్ అరేనాలో జెరేమీ చార్డీతో జరిగిన మ్యాచ్‌లో 6-3, 6-1, 6-2 వరుస సెట్లలో వరల్డ్ నెంబర్ వన్ జకోవిచ్ విజయం సాధించాడు. ఇది అతనికి 297వ గ్లాండ్‌స్లామ్ మ్యాచ్ విజయం. సెరేనా విలియమ్స్ జర్మనీకి చెందిన లారా సిగ్మండ్‌పై 6-1, 6-1 తో గెలిచి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది.
బెల్జియంకు చెందిన కిరిస్టెన్ ఫ్లిప్‌కెన్స్‌పై 7-5, 6-2 తేడాతో వీనస్ విలియమ్స్ విజయం సాధించింది. యూఎస్ ఓపెన్ విజేత నయోమీ ఒసాక 6-1, 6-2 తేడాతో అనెస్తీసియాపై గెలుపొందింది. హెలెప్ కూడా ఆస్ట్రేలియాకు చెందిన లిజ్జీ కబ్రేరాపై 6-2, 6-1 వరుస సెట్లలో గెలిచి రెండో రౌండ్ చేరింది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఇగ ష్వామ్‌టెక్ నెథర్లాండ్‌కు చెందిన అరంటా రుస్‌పై 6-1, 6-3 తేడాతో గెలిచింది. కాగా, 27వ ర్యాంకర్ కెర్బర్‌పై అన్‌సీడెడ్ అమెరికా క్రీడాకారిణి బెర్నార్డా పీరా 6-0, 6-4 తేడాతో సంచలన విజయం నమోదు చేసింది. ఆస్ట్రేలియా ఓపెన్ మాజీ చాంపియన్ అయిన కెర్బర్ ఇలా తొలి రౌండ్‌లోనే ఓడిపోవడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇక తొలి రౌండ్ మ్యాచ్ ఆడిన సెరేనా విలియమ్స్ వన్ లెగ్గెడ్ డ్రెస్ చర్చనీయాంశంగా మారింది. కాగా, అమెరికాకు చెందిన మాజీ స్ప్రింటర్, ఒలంపియన్ ఫ్లారెన్స్ డ్రిఫిత్ స్పూర్తితో ఆ డ్రెస్ వేసుకున్నట్లు చెప్పింది.