స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలను బ్రేక్

by Harish |
స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలను బ్రేక్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్ల వరుస నష్టాలను వారాంతం బ్రేక్ పడింది. శుక్రవారం ఉదయం ప్రారంభమైన సమయంలో మిశ్రమంగా కదలాడిన సూచీలు మిడ్-సెషన్ అనంతరం లాభాల బాట పట్టాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఎనర్జీ, టెలికాం రంగాల్లో కొనుగోళ్లు మద్దతు లభించడంతో స్టాక్ మార్కెట్లు చివర్లో పుంజుకున్నాయి. గత కొన్నాళ్లుగా వరుస జీవితకాల రికార్డులను సాధించిన స్టాక్ మార్కెట్లు ఈ వారం 1 శాతం నష్టంతో ముగిశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 166.07 పాయింట్లు ఎగసి 52,484 వద్ద ముగియగా, నిఫ్టీ 42.20 పాయింట్లు లాభపడి 15,722 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఫార్మా రంగం, బ్యాంకింగ్, ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ, మీడియా రంగాలు పుంజుకోగా, మెటల్, ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంకులు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, ఎస్‌బీఐ, టైటాన్ షేర్లు అధిక లాభాలను దక్కించుకోగా, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్, సన్‌ఫార్మా, టీసీఎస్, ఎల్అండ్‌టీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.74 వద్ద ఉంది.

Advertisement

Next Story