- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధిక లాభాలు నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి అధిక లాభాలను సాధించాయి. దేశీయంగా కీలక సంఘటనలు ఏమీ లేనప్పటికీ కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్‌పై మదుపర్ల భయాలు తొలగడం, అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటం వంటి పరిణామాలు మంగళవారం సూచీల ర్యాలీ కి దోహదపడ్డాయి. గత రెండు వారాలుగా వరుస సెషన్లలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న స్టాక్ మార్కెట్లలో తిరిగి పుంజుకుంటున్న ధోరణి కనిపిస్తుంది. దీనికితోడు ఐటీ, ఎనర్జీ రంగాల షేర్లు మద్దతివ్వడంతో లాభాలు గణనీయంగా కొనసాగుతున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ట్రేడింగ్‌ను సానుకూలంగా ప్రారంభమైన తర్వాత మిడ్-సెషన్ సమయంలో స్టాక్ మార్కెట్లు కొంత తడబడినప్పటికీ తర్వాత పుంజుకున్నాయి.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 477.24 పాయింట్లు ఎగసి 57,897 వద్ద, నిఫ్టీ 147 పాయింట్లు పెరిగి 17,233 వద్ద ముగిశాయి. నిఫ్టీ లో ఐటీ, ఎనర్జీ రంగాలు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కంపెనీల షేర్లు మాత్రమే నష్టపోయాయి. మిగిలిన షేర్లు లాభాల్లో కదలాడాయి. ముఖ్యంగా ఏషియన్ పెయింట్, సన్‌ఫార్మా, ఎంఅండ్ఎం, ఆల్ట్రా సిమెంట్, టైటాన్, ఎన్‌టీపీసీ, ఎల్అండ్‌టీ, టెక్ మహీంద్రా, రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.71 వద్ద ఉంది.