లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు..

by Harish |
లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు అధిక లాభాలతో కళకళలాడాయి. ఆదివారం ప్రభుత్వ గణాంకాల్లో జీఎస్టీ వసూళ్లు గతేడాదితో పోలిస్తే 33 శాతం అధికంగా నమోదవడంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. దీనికితోడు ప్రపంచ మార్కెట్లలో సానుకూల ధోరణి దేశీయ పరిణామాలకు మరింత మద్దతునిచ్చాయి. అంతేకాకుండా రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి దిగ్గజ కంపెనీల షేర్లు సోమవారం నాటి ర్యాలీకి అండగా ర్యాలీ చేశాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 363.79 పాయింట్లు ఎగిసి 52.950 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 122.10 పాయింట్లు లాభపడి 15,885 వద్ద ముగిసింది. నిఫ్టీలో రియల్టీ అత్యధికంగా 5 శాతం పుంజుకోగా, ఆటో, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో మెరుగైన కొనుగోళ్లు జరిగాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్, ఎంఅండ్ఎం, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, మారుతీ సుజుకి, ఇన్ఫోసిస్, ఐటీసీ షేర్లు లాభాలను సాధించాయి.

టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.34 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed