- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరుస మార్కెట్ రికార్డులకు బ్రేక్.. ఎందుకంటే ?
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్ల వరుస రికార్డు లాభాలకు మంగళవారం బ్రేక్ పడింది. గత కొన్ని సెషన్లుగా ఆల్-టైమ్ రికార్డులతో ర్యాలీ చేస్తున్న సూచీలు వెనక్కి తగ్గాయి. ఉదయం ప్రారంభం నుంచే నష్టాలను ఎదుర్కొన్న స్టాక్ మార్కెట్లు మిడ్-సెషన్ సమయం వరకు అదే ధోరణిలో కొనసాగాయి. అయితే, ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు కారణంగా జీవితకాల గరిష్ఠాలను తాకిన తర్వాత చివరిలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో ఇంట్రాడే గరిష్ఠాలను మార్కెట్లు వెనకడుగు వేశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ స్వల్పంగా 17.43 పాయింట్లు కోల్పోయి 58,279 వద్ద క్లోజయింది. నిఫ్టీ 15.70 పాయింట్లు నష్టపోయి 17,362 వద్ద ముగిసింది.
నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాలు క్షీణించాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ, రియల్టీ ఇండెక్స్‌లు 1-2 శాతం మధ్య నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఆల్ట్రా సిమెంట్, నెస్లె ఇండియా షేర్లు లాభాలను దక్కించుకోగా, సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.44 వద్ద ఉంది.