ఎట్టకేలకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు!

by Harish |
ఎట్టకేలకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు!
X

దిశ,వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో గురువారం ఉదయం దేశీయ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు లాభ నష్టాల మధ్య ఒడిదుడుకులకు లోనైనా ముగిసే సమయానికి లాభాలను నమోదు చేశాయి. ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుందనే ఆందోళనల నుంచి నెమ్మదిగా కోలుకుని సెన్సెక్స్ 222.80 పాయింట్ల లాభంతో 30,602 వద్ద ముగిసింది. నిఫ్టీ 67.50 పాయింట్లు లాభపడి 8,992 వద్ద క్లోజయింది. అధికంగా లార్జ్ క్యాప్ షేర్లను కొనేందుకు మదుపర్లు ఆసక్తి చూపించారు. ముఖ్యంగా ఎఫ్ఎమ్‌సీజీ, ఐటీ రంగాలు నష్టాలను నమోదు చేశాయి. విప్రో సంస్థ అమెరికా వ్యాపారంపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఐటీ షేర్లు దిగజారాయి. ఫార్మా, బ్యాంకింగ్ రంగ షేర్లు లాభాలను నమోదు చేశాయి. ఎన్‌టీపీసీ, ఐసిఐసిఐ బ్యాంక్, టైటాన్, ఎల్‌టీ, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా షేర్లు లాభాలను నమోదు చేయగా, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Advertisement

Next Story

Most Viewed