వారాంతం ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు!

by Harish |
వారాంతం ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈ వారం మరోసారి ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం ప్రారంభంలో స్వల్ప లాభాలతో మొదలైన తర్వాత రోజంతా అమ్మకాల ఒత్తిడికి గురైన సెన్సెక్స్ ఇండెక్స్ చివరికి అతిస్వల్ప పాయింట్ల లాభంతో ముగించాయి. నిఫ్టీ సైతం అదే ధోరణిలో తక్కువ పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభించినప్పటికీ చివరికి నష్టాలను నమోదు చేసింది. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు మద్దతునిచ్చినప్పటికీ, టెలికాం, మెటల్, ఆటో రంగాల షేర్లు మార్కెట్ల జోరుకు కళ్లెం వేశాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 12.78 పాయింట్లు లాభపడి 51,544 వద్ద ముగియగా, నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 15,163 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంక్, ఫైనాన్స్, ఫార్మా, ప్రైవేట్ బ్యాంకుల రంగం స్వల్పంగా బలపడగా, మెటల్, ఎఫ్ఎంసీజీ, మీడియా, ఆటో రంగాలు డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిసి, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఐటీసీ, సన్‌ఫార్మా, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్, ఎన్‌టీపీసీ, మారుతీ సుజుకి షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.84 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed