మార్కెట్లకు తప్పని కష్టాలు!

by Harish |
మార్కెట్లకు తప్పని కష్టాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: మార్కెట్లకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. దేశీయంగా లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలున్నయనే సంకేతాలకు తోడు, ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల మధ్య మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. మరోవైపు వరల్డ్ బ్యాంక్ ఇండియా వృద్ధిరేటును 2.8 శాతంగా ఉండోచ్చనే అంచనాలను విడుదల చేయడం కూడా మార్కెట్లకు రుచించలేదు. కరోనా వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతుందనే అంచనాలతో ఆసియా మారెక్ట్లు కూడా ప్రతికూలంగా కొనసాగుతున్నాయి. ఉదయం 10.30 గంటల సమయంలో సెన్సెక్స్ 484.96 పాయింట్లు నష్టపోయి 30,674 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 128.05 పాయింట్ల నష్టంతో 8,983 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గిన నేపథ్యంలో చమురు ఉపెక్+దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు అంగీకరించాయి. దీంతో మార్కెట్లో ధరలు పెరిగాయి. ఇక, అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 75.65 వద్ద ఉంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్ సూచీలు లాభపడగా, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్‌జీసీ, టైటాన్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.

Tags : sensex, nifty, BSE, NSE, stock market

Advertisement

Next Story

Most Viewed