ఐదోరోజూ లాభాల్లో మార్కెట్లు!

by Harish |   ( Updated:2020-06-02 06:09:22.0  )
ఐదోరోజూ లాభాల్లో మార్కెట్లు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: దేశీయ స్టాక్‌ మార్కెట్లు‌ వరుసగా ఐదవ రోజూ లాభాల్లో ముగిశాయి. లాక్‌డౌన్‌ సడలింపుల వల్ల ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభమవడం, తక్కువ ఎన్‌పీఏలు నమోదు అవుతాయనే అశావహ అంచనాలతో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లు ర్యాలీ చేసినట్టు మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 522 పాయింట్ల లాభంతో 33,825 వద్ద ట్రేడవ్వగా, నిఫ్టీ 152.95 పాయింట్లు లాభపడి 9,979 వద్ద ముగిసింది. ఈ ఐదు రోజుల్లో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 18 శాతం మేర లాభపడింది. గడిచిన రెండు వారాల్లో నిఫ్టీ పైనాన్స్‌ ఇండెక్స్‌ 17 శాతం పెరిగింది. ఉదయం నుంచి ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మారుతీ సుజుకి, ఐటీసీ, ఎన్‌టీపీసీ, నెస్లె ఇండియా, హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు మాత్రమే నష్టపోగా, మిగిలిన సూచీలు లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.36 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed