లాక్‌డౌన్ సడలింపులతో మార్కెట్లలో జోష్!

by Harish |
లాక్‌డౌన్ సడలింపులతో మార్కెట్లలో జోష్!
X

దిశ, సెంట్రల్ డెస్క్: దాదాపు రెండు నెలల లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడంతో మార్కెట్లలో జోష్ పెరిగింది. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో మార్కెట్లు లాభాల్లో కదలాడాయి. సోమవారం సెన్సెక్స్ 879.42 పాయింట్ల లాభంతో 33,303 వద్ద ట్రేడవ్వగా, నిఫ్టీ 245.85 పాయింట్లు లాభపడి 9,826 వద్ద ముగిసింది. ముఖ్యంగా లాక్‌డౌన్ సడలింపులు సోమవారం నుంచి అమలైన కారణంగా దేశీయ మార్కెట్లు ఉదయమే 900 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. ఒకదశలో సెన్సెక్స్ 1,249 పాయింట్ల వరకూ లాభపడినప్పటికీ తర్వాత 879 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా కూడా అనేక దేశాలు లాక్‌డౌన్ నిబంధనలను సడలించడంతో వ్యాపార కార్యకలాపాలు పునరుద్ధరించబడ్డాయి. దీంతో మార్కెట్లలో సెంటిమెంట్ బలపడింది. వీటికితోడు, జూన్ 8 నుంచి మరిన్ని సడలింపులు ఉండటం కూడా మార్కెట్ల జోరు పెరగడానికి కారణమైంది. ముఖ్యంగా అధిక వెయిటేజీ ఉన్న ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌ రంగాల షేర్లు సూచీలను భారీ లాభాలను ఆర్జించేలా చేశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, నెస్లె ఇండియా, ఆల్ట్రాటెక్ సిమెంట్, హీరోమోటోకార్ప్, ఎల్‌టీ షేర్లు మాత్రమే నష్టాళ్లో ట్రేడవ్వగా మిగిలిన సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed