జోరు కొనసాగించిన మార్కెట్లు!

by Harish |
జోరు కొనసాగించిన మార్కెట్లు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: దేశీయ మార్కెట్లు నిన్నటి లాభాలను కొనసాగించాయి. ఉదయం నుంచే లాభాల్లో కదలాడిన సూచీలు చివరి వరకూ అదే జోరును కొనసాగించాయి. నిన్నటి లాభాల్లో ప్రధాన భూమిక పోషించిన బ్యాంకింగ్ షేర్లు గురువారం కూడా అదే ధోరణిలో దూసుకెళ్లాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 595.37 పాయింట్ల లాభంతో 32,200 వద్ద ముగియగా, నిఫ్టీ 175.15 పాయింట్లు లాభపడి 9,490 వద్ద ముగిసింది. రంగాల వారీగా చూస్తే బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో, మెటల్, మీడియా రంగాలు సుమారు 3 శాతానికి పైగా లాభపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐటీసీ, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్ మినహా మిలిన సూచీలన్నీ లాభాల్లో ట్రేడయ్యాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.75గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా ఉన్నాయి. గురువారం బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌ 34.94 డాలర్లుగా ఉంది. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌ 32.24 డాలర్లకు తగ్గింది.

Advertisement

Next Story

Most Viewed