భారీ లాభాల్లో మార్కెట్లు!

by Harish |
భారీ లాభాల్లో మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా అన్ని దేశాలు కోవిడ్-19 పై కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉండటం, ఆ ప్రభావం దేశీయంగా సానుకూల సంకేతాలివ్వడంతో మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. గత వారం వరకూ భారీగా నష్టాలను మూటగట్టుకున్న తర్వాత మంగళవారం లాభాల బాట పట్టాయి. ఆసియా మార్కెట్లలో సానుకూల సంకేతాలకు తోడు అమెరికా మార్కెట్లు కూడా భారీ లాభాలను చూశాయి. ఈ పరిణామాలు దేశీయ మార్కెట్ల లాభాలకు కారణమయ్యాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 1138.21 పాయింట్లు లాభపడి 28,771 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 337.20 పాయింట్ల లాభంతో 8,421 వద్ద కొనసాగుతోంది. అమెరికాలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నప్పటికీ యూరప్‌లోని ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం దేశీయంగా మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫినాన్స్, ఐటీసీ మినహా మిగిలిన సూచీలన్నీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు అత్యధిక లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Advertisement

Next Story

Most Viewed