మళ్లీ నష్టాల్లోనే మార్కెట్లు

by Harish |   ( Updated:2020-09-22 06:15:21.0  )
మళ్లీ నష్టాల్లోనే మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా భయం మార్కెట్లను వెంటాడుతోంది. సోమవారం నాటి దారుణ పతనం తర్వాత మంగళవారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు (Domestic equity markets) మళ్లీ నష్టాలను నమోదు చేశాయి. పలు అంతర్జాతీయ బ్యాంకులు అక్రమ ఆర్థిక ఒప్పందాలకు పాల్పడ్డాయనే వార్తలతో పాటు యూరప్ దేశాల్లో విజృంభిస్తున్న కరోనా దెబ్బకు మళ్లీ లాక్‌డౌన్ సంకేతాలు మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉదయం ప్రారంభ సమయంలో సానుకూలంగా కనిపించినప్పటికీ అనంతరం అమ్మకాలు జోరందుకున్నాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ (Sensex) 300.06 పాయింట్లు కోల్పోయి 37,734 వద్ద ముగియగా, నిఫ్టీ 96.90 పాయింట్లు నష్టపోయి 11,153 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఆటో, ప్రభుత్వ రంగ బ్యాంకులు, మీడియా, మెటల్, రియల్టీ రంగాలు 2.5 శాతానికి పైగా నీరసించాయి. ఫార్మా, ఐటీ రంగాలు మాత్రమే స్వల్పంగా బలపడ్డాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌ (Sensex Index)లో హెచ్‌సీఎల్, టీసీఎస్, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రా సిమెంట్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభపడగా, మారుతీ సుజుకి, ఎల్అండ్‌టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్, ఏషియన్ పెయింట్, కోటక్ బ్యాంక్, టైటాన్, నెస్లె ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎంఅండ్ఎం షేర్లు అధికంగా నష్టపోయాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.58 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed