- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రికార్డులు నమోదు చేసిన మార్కెట్లు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా ఆరో రోజు రికార్డు స్థాయిలో లాభాలను దక్కించుకున్నాయి. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో కుదేలైన సూచీలు కేవలం 7 నెలల వ్యవధిలో సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. సెన్సెక్స్ ఇండెక్స్, నిఫ్టీలు చారిత్రాత్మక గరిష్టాలను చేరుకున్నాయి. ప్రస్తుత ఏడాది జనవరి చివరి వారంలో సాధించిన ఆల్‌టైమ్ హైలను రెండు ఇండెక్సులూ ఒకేరోజున అధిగమించడం గమనార్హం.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయంతో పాటు, త్వరలో మరో ఉద్దీపన ప్యాకేజీ అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు దూకుడు పెంచగా, బైడెన్ గెలుపుతో భారత ఐటీ కంపెనీలకు సానుకూలంగా ఉండనుందనే వార్తలతో ఐటీ, ఫైనాన్స్ షేర్లు ర్యాలీ చేశాయి. వీటికితోడు దేశీయంగా ఆర్థికవ్యవస్థ రికవరీ సంకేతాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. అలాగే, విద్యుత్ డిమాండ్ పెరగడం, తయారీ గణాంకాలు సానుకూలంగా ఉండటంతో కరోనా వల్ల ఏర్పడ్డ ఆందోళనలు తొలిగాయి.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 704.37 పాయింట్లు ఎగసి 42,597 వద్ద ముగియగా, నిఫ్టీ 197.50 పాయింట్లు లాభపడి 12,461 వద్ద ముగిసింది. నిఫ్టీలో అన్ని రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐటీసీ, మారుతీ సుజుకి, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు మాత్రమే డీలపడగా, మిగిలిన అన్ని షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ముఖ్యంగా ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, టైటన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.09 వద్ద ఉంది.