స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!

by Harish |
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లకు నష్టాలు వెంటాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో కదలాడిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు మిడ్ సెషన్ తర్వాత నష్టాలను ఎదుర్కొన్నాయి. కొనుగోళ్లు తగ్గి అమ్మకాలు జోరందుకోవడంతో చివరి గంటలో స్వల్పంగా నష్టాలను నమోదు చేశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 45.72 పాయింట్లను కోల్పోయి 34,915 వద్ద ముగియగా, నిఫ్టీ 10.30 పాయింట్లు నష్టపోయి 10,302 వద్ద ముగిసింది. ముఖ్యంగా నిఫ్టీలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫార్మా, మీడియా రంగాలు 1 శాతానికి పైగా నష్టాల్లో ట్రేడవ్వగా, రియల్టీ స్వల్పంగా నష్టపోయింది. ఆటో 1 శాతం లాభపడింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మారుతీ సుజుకి, నెస్లె ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ షేర్లు లాభాలను నమోదు చేయగా, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, ఓఎన్‌జీసీ, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.

Advertisement

Next Story