ఆర్‌బీఐ భరోసాతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు!

by Harish |
ఆర్‌బీఐ భరోసాతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉండటంతో దేశీయ మార్కెట్లు లాభపడ్డాయి. ముఖ్యంగా కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు మ్యుచువల్ ఫండ్స్ సంస్థలకు ఆర్‌బీఐ రూ. 50 వేల కోట్ల లిక్విడిటీ సాయం అందించడంతో మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ముఖ్యంగా నిఫ్టీ బ్యాంకు అధికంగా లాభాలను నమోదు చేసింది. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 415.86 పాయింట్ల లాభంతో 31,743 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 127.90 పాయింట్లు లాభపడి 9,282 వద్ద ముగిసింది. ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభాలను కదలాడగా, ఎన్‌టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టాలను చూశాయి. యూఎస్ డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.17 వద్ద ఉంది.

tags : sensex, nifty, BSE, NSE, stock market

Advertisement

Next Story

Most Viewed