లాభాల స్వీకరణతో డీలాపడ్డ మార్కెట్లు

by Anukaran |
లాభాల స్వీకరణతో డీలాపడ్డ మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా ఎనిమిది రోజుల ర్యాలీ తర్వాత డీలాపడింది. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించడంతో మార్కెట్ల దూకుడుకు బ్రేక్ పడింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థికవ్యవస్థ ఉత్తేజానికి ‘ఆత్మ నిర్భర్ భారత్ 3.0’ ప్యాకేజీని ప్రకటించినప్పటికీ మార్కెట్లపై ప్యాకేజీ ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు.

ట్రేడర్లు లాభాల స్వీకరణకే మొగ్గు చూపడంతో సూచీల వరుస లాభాలకు అడ్డుకట్ట పడిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 236.48 పాయింట్లు పడిపోయి 43,357 వద్ద ముగియగా, నిఫ్టీ 58.35 పాయింట్లు నష్టపోయి 12,690 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంకింగ్ రంగా 2 శాతం వరకు డీలాపడగా, రియల్టీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటో, మీడియా రంగాలు స్వల్పంగా పుంజుకున్నాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్, ఐటీసీ, ఎల్అండ్‌టీ, బజాజ్ ఫిన్‌సర్వ్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడగా, ఎస్‌బీఐ, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఓఎన్‌జీసీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.63 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed