అగాథంలో సూచీలు..కుప్పకూలిన మార్కెట్లు!

by Harish |
అగాథంలో సూచీలు..కుప్పకూలిన మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కేసులు పెరుగుతున్న భయంలో మార్కెట్లు దారుణంగా పడిపోయాయి. దేశీయ సూచీలన్నీ కుప్పకులాయి. కరోనా కారణంగా అంతర్జాతీయంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు క్షీణించే అవకాశాలున్నాయనే సంకేతాలతో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించారు. మదుపర్ల అప్రమత్తతతో ఆసియా మార్కెట్లన్నీ దారుణ నష్టాలను నమోదు చేశాయి. ఆ ప్రభావం కారణంగా దేశీయం మార్కెట్లలో సూచీలన్నీ నేలకొరిగాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1506.75 పాయింట్ల నష్టంతో 36,069 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 412.20 పాయింట్లను కోల్పోయి 10,577 వద్ద ట్రేడవుతోంది. ఇప్పటికే లక్షకు దాటిన కరోనా మరణాలు వందకు పైగా దేశాల్లోకి విస్తరించింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లోని అన్ని సూచీలూ పతనంలోనే కదలాడుతున్నాయి. ఈ పరిణామాలతో పాటు అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గాయి. దీంతో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతింది. ఇక, యూఎస్ డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.61 వద్ద ఉంది. సెన్సెక్స్‌లో ఏషియన్ పెయింట్స్ మాత్రమే 0.1 శాతం లాభంతో కొనసాగుతోంది. మిగిలిన షేర్లన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.

tags: sensex, nifty, BSE, NSE, stock market

Advertisement

Next Story