డాలర్ బాయ్.. మోసాలకు కేరాఫ్ అడ్రస్ !

by Anukaran |   ( Updated:2020-09-02 10:26:42.0  )
డాలర్ బాయ్.. మోసాలకు కేరాఫ్ అడ్రస్ !
X

దిశ, వెబ్‌డెస్క్: డాలర్ బాయ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 139మంది తనపై అత్యాచారం చేశారని ఓ యువతితో కేసు పెట్టించిన డాలర్ బాయ్ మొదట్నుంచి మోసాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. భద్రాద్రి జిల్లాలో రాజ శ్రీకర్‌రెడ్డి అలియాస్ డాలర్ బాబుపై మూడు కేసులున్నాయి. రామవరంలో చీటిల పేరుతో డబ్బులు డిపాజిట్ చేయించి… దాదాపు రూ.10లక్షలు మోసం చేసి హైదరాబాద్ పారిపోయాడు. ఇదేగాక బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకొని వస్తున్న వ్యక్తి నుంచి 7లక్షలు లాక్కెళ్లగా కేసు నమోదయ్యింది. ముగ్గురు మహిళను పెళ్లి చేసుకొని మోసం చేశాడని ఆరోపణలు ఉన్న డాలర్ బాయ్ కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నాడు.

Advertisement

Next Story