- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంధన ధరల తగ్గింపుపై పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు సంచలన వ్యాఖ్యలు
దిశ, నిజామాబాద్: దేశంలో జరిగిన 29 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల ఎన్నికల్లో ప్రజలు బీజేపీని తిరస్కరించడంతో కేంద్రం పెట్రోల్‌పై 5 డీజిల్‌పై 10 రూపాయలు తగ్గించిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రెండు సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్‌పై 46 శాతం ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచి అంబానీ, ఆదానీల ఆస్తులు పెంచే విధంగా మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు యాభై శాతం తగ్గినా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడంలేదన్నారు.
మిగతా రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్‌పై సుంకాన్ని తగ్గిస్తే.. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం తగ్గించడం లేదని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలను ప్రజలే ఇంటికి పంపిస్తారని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతుల జీవితాలను నాశనం చేస్తున్నాయని మండిపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో తగ్గిన క్రూడాయిల్ ధరలకు తగిన విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. శుక్రవారం నిజామాబాద్ కాంగ్రెస్ భవన్ నందు నిర్వహించిన విలేఖరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ ,అర్బన్ అర్బన్ ఇంచార్జి తాహెర్బిన్ హందాన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు వేణు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విగ్నేష్ యాదవ్, సుభాష్ జాదవ్, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.