- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్.. అనిల్ నోటిపారుదలశాఖ మంత్రి
దిశ, ఏపీ బ్యూరో: సీఎం వైఎస్ జగన్, నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌పై మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్నూలు న్యాయరాజధాని అన్నాడు కరోనా కల్లోలంలో చిక్కింది. విశాఖ పరిపాలనా రాజధానిగా ప్రకటించాడు. అప్పటి నుంచి విశాఖలో ఏదో ఒక దారుణం జరుగుతూనే ఉంది. విశాఖ పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి ఎల్జీ పాలీమర్స్, సాయినార్, హెచ్పీసీఎల్, షిప్‌యార్డ్ ప్రమాదాలలో వందల మంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. బెజవాడ దుర్గమ్మకి చీరసమర్పించేందుకు వెళ్లాడు. కొండచరియలు విరిగిపడ్డాయని చెప్పుకొచ్చారు. కచ్చులూరు బోటు ప్రమాదంలో 60 మంది చనిపోయారు. ఇదంతా దరిద్రపాదం వల్లనే జరిగిందంటూ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నోటిపారుదల శాఖ మంత్రి అనిల్
అనిల్ కుమార్ యాదవ్ నీటి పారుదల శాఖ మంత్రి కాదని నోటిపారుదల శాఖ మంత్రి అంటూ అయ్యన్నపాత్రుడు విమర్శించారు. పులిచింతల ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపి పుణ్యం కట్టుకో నాయనా! మేయించిన మహామేత లేడు కానీ, మేసిన యువమేత ఉన్నాడు. అడ్డంగా దొరుకుతాడు అంటూ ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఉండి అన్నింటికీ చంద్రబాబే కారణమని చెప్పడానికి వైసీపీ నేతలకు సిగ్గుండాలన్నారు. చంద్రబాబు తెచ్చిన కియా మీరే తెచ్చారని.. సభలో నిస్సిగ్గుగా ఉత్తరం చదువుతారు. పులివెందుల పులకేశీల పాపం పులిచింతలకి శాపమైతే.. చంద్రబాబుపై ఏడుస్తావేంటి బెట్టింగ్ బంగార్రాజూ అంటూ విరుచుకుపడ్డారు. కబుర్లు ఆపి గేటు బిగించే పని చూడు అంటూ హితవు పలికారు. నోటిపారుదలశాఖా మంత్రి… మీ పాలనలో అవినీతి ఎక్కువే.. అరాచకమూ ఎక్కువే. డ్యాములు నిండినా చుక్కనీరు వాడుకోవడానికి పనికిరాదంటూ అయ్యన్నపాత్రుడు వ్యంగ్యంగా విమర్శించారు.