- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
"వకీల్ సాబ్" ఇక లేరు…!
దిశ – మెదక్ : నాలుగు దశాబ్దాలుగా న్యాయవాదిగా అందరి మన్ననలు అందుకున్న ప్రముఖ “వకీల్ సాబ్” హర్కార్ జగదీష్ (72) కరోనా మహమ్మారికి బలయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆయనకు కోవిడ్ పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని సన్ షైన్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
1980 లో ఆయన న్యాయవాద వృత్తిలోకి వచ్చి అనేక కేసులను తనదైన శైలిలో వాదించి రాణించినట్టు ఆప్తులు పేర్కొన్నారు. అంతకుముందు ఆయన కొన్నేళ్ళు ఉపాధ్యాయ వృత్తిని చేశారు. న్యాయవాద వృత్తిలో ఉంటూనే ఆయన క్రియాశీల రాజకీయాల్లో చెరగని ముద్ర విసిన జగదీష్, 1995 లో టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పటి మంత్రులు కరణం రాంచందర్ రావ్, దగ్గుపాటి వెంకటేశ్వర రావులకు అత్యంత ఆప్తుడిగా ఉండేవాడు. మృతునికి భార్య విజయ కుమారుడు, కుమార్తె ఉన్నారు. జగదీష్ మృతిపై ప్రముఖులు సంతాపం తెలిపారు.