- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్ట్ మనోజ్‌కు ప్రముఖుల నివాళి
దిశ, న్యూస్‌బ్యూరో
కరోనాతో మృతిచెందిన జర్నలిస్ట్ మనోజ్‌కు హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు చాడ వెంకట్ రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, నర్సింహారావు, సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ నివాళులర్పించారు. అనంతరం చెరుకు సుధాకర్ మాట్లాడుతూ..మనోజ్ మృతి, జూనియర్ డాక్టర్ల ఆందోళన తర్వాత అయినా ప్రభుత్వం ఆలోచనలో మార్పు రావాలని ఆశించారు. ప్రతి జిల్లాలో కోవిడ్ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మనోజ్ మృతి చెందాడని ఆరోపించారు. మనోజ్ కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. కోదండరాం మాట్లాడుతూ..మనోజ్ పేరుతో జర్నలిస్ట్‌లకు ఆరోగ్య చట్టం తేవాలని డిమాండ్ చేశారు. కొవిడ్ నివారణకు కోర్టు ఇచ్చిన సూచనలను ప్రభుత్వం తప్పకుండా పాటించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్, సీనియర్ జర్నలిస్ట్‌లు సంపత్ కుమార్, అమర్, సతీష్ కమల్, సిల్వేరి శ్రీశైలం, సాయికిరణ్, ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఓల్డ్ సిటీ జర్నలిస్టుల ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద మనోజ్‌కు నివాళ్లర్పించారు.