కరోనాతో సీనియర్ జర్నలిస్ట్ మృతి

by Shyam |   ( Updated:2021-05-08 23:37:13.0  )
కరోనాతో సీనియర్ జర్నలిస్ట్ మృతి
X

దిశ,వెబ్ డెస్క్ : కరోనా మూలాన ఎంతో మంది జర్నలిస్టులు మరణిస్తున్నారు. తాజాగా మరోజర్నలిస్ట్ కరోనాకాటుకు బలయ్యాడు. ఓ ప్రముఖ టీవి ఛానల్ లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ గరం గరం ఫేమ్ ఆర్టిస్ట్ గోపి ఆదివారం ఉదయం కరోనాతో కన్నుమూశారు. గోపిది చిత్తూరు జిల్లా మదనపల్లి. ఆయనకు వారం రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో ఆయన చిత్తూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. గరం గరం వార్తలతో ఆయన ఎంతో మందిని నవ్వించారు. ఆయన మృతి పట్ల ఎంతమంది జర్నలిస్ట్ లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story