- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
44 ఏళ్ల వయసులో సీనియర్ నటి రెండో పెళ్లి.. నిజమేనా..?
దిశ, వెబ్ డెస్క్: విక్టరీ వెంకటేష్ సరసన 'ధర్మచక్రం' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది కన్నడ సోయగం ప్రేమ. ఈ చిత్రం తర్వాత దేవి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన ఈ భామ కొద్దీ రోజులకే ఫేడ్ అవుట్ హీరోయిన్లలో కలిసిపోయింది. ఇక జీవన్ అప్పాచ్చు అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న ప్రేమ ఆ బంధానికి కూడా త్వరగానే స్వస్తి పలికింది. 2016 లో అతనితో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నారు. ఇక ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ప్రేమ రెండో పెళ్లికి సిద్దమవుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి.
44 ఏళ్ల వయసులో ఈ సీనియర్ నటి రెండో పెళ్లి చేసుకొంటుందన్న వార్తలపై ప్రేమ స్పందించారు. ఇలాంటి రూమర్లను నమ్మొద్దని, తానూ ఇప్పటికి ఒంటరిగానే ఉన్నానని తెలిపారు. ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె ఇప్పటివరకు ఎవరికి తెలియని తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
తన రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో నిజంలేదని, తన పెళ్లి చుట్టూ ఉన్న ఊహాగానాలు నిజం కాదని నమ్మవద్దని అభ్యర్థించారు. అంతేకాదు.. తాను కూడా క్యాన్సర్ బారిన పడినట్లు.. అయితే ఇప్పుడు క్యాన్సర్ ను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని చెప్పారు.ఇక తనకు పిల్లలు ఉన్నారన్న మాటల్లో కూడా నిజం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె కన్నడ సినిమాల్లోనే సపోర్టింగ్ పాత్రల్లో నటిస్తు జీవితాన్ని కొనసాగిస్తోంది. అడపా దడపా తెలుగు సినిమాల్లో కూడా మెరుస్తోంది.