తమిళ సీనియర్ నటుడు మృతి.. ప్రముఖుల సంతాపం

by Shyam |   ( Updated:2021-04-30 04:44:44.0  )
తమిళ సీనియర్ నటుడు మృతి.. ప్రముఖుల సంతాపం
X

దిశ, సినిమా : తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. తమిళ నటుడు ఆర్ఎస్‌జీ చెల్లదురై కన్నుమూశారు. ‘తేరి, మారి, కత్తి, టిక్ టిక్ టిక్’ లాంటి చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆయన గురువారం చైన్నైలో మరణించారు. తండ్రి, తాత పాత్రల్లో కనిపించి మెప్పించిన చెల్లదురై.. కార్డియాక్ అరెస్ట్‌తో బాత్‌రూమ్‌లో పడిపోగా బంధువులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇప్పటి వరకు దాదాపు 50 చిత్రాల్లో నటించిన ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఇండస్ట్రీ ప్రముఖులు.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.

Advertisement

Next Story