- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'పిల్లలు బిహార్‌లో ఉన్నరు.. మేం పోతాం సార్'
by Shyam |
దిశ, నల్లగొండ: యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో సుమారు 30 మంది వలస కూలీలు వివిధ రైస్ మిల్లుల్లో పనిచేస్తున్నారు. వీరు గత రెండు మూడు నెలల క్రితం పొట్టకూటి కోసం బిహార్ రాష్ట్రం నుంచి వచ్చారు. వచ్చిన నెల రోజులకే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది. తమ వాళ్లు బీహార్లో ఎలా ఉన్నారోననే ఆందోళనతో జీవనం సాగిస్తున్నట్లు వారు చెబుతున్నారు. తమ పిల్లలు బిహార్‌లో ఉన్నారని… వారి వద్దకు వెళ్లేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారు. నెలరోజుల క్రితం తహశీల్దార్ తమ వివరాలు తీసుకున్నారని… ప్రభుత్వం అందించే 500 రూపాయలు, బియ్యం అందింది కానీ, తమకు ఇంతవరకూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించలేదని వాపోతున్నారు. త్వరగా ప్రభుత్వం తమ స్వంతరాష్ట్రానికి పంపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Advertisement
Next Story