- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరకరలాడే సేమియా పకోడీ
వాతావరణం చల్లగా ఉన్న సమయంలో లేదా ఏదైనా వేడిగా తినాలనిపించినప్పుడు పకోడీ ని మించిన స్నాక్ మరొకటి ఉండదు. అలాంటి సమయాల్లో కరకరలాడే సేమియా పకోడీ చాలా ఉంటుంది. మరి ఇప్పుడు టేస్టీ సెమియా పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
కావాల్సిన పదార్ధాలు
సేమియా -ఒక కప్పు
శనగపిండి -ముప్పావు కప్పు
ఉల్లిపాయ ముక్కలు – 1 కప్పు
పచ్చిమిర్చి -3 (చిన్నగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 టీస్పూన్
కరివేపాకు రెబ్బలు -2
కారం -1 టీస్పూన్
ఉప్పు -తగినంత
బేకింగ్ పౌడర్ -చిటికెడు
నూనె -వేగించడానికి సరిపడా
తయారీ చేసే విధానం:
ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసి, అది వేడయ్యాక సేమియా వేసుకుని దొరగా వేయించుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో నీరు మరిగించి అందులో సేమియా వేసి పలుకుమీద ఉడికించి దించేసుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లో ఉడికించిన సేమియా, శెనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర తురుము, కారం, ఉప్పు, బేకింగ్ పౌడర్ వేసి నీరు వేయకుండా బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకుని, అది కాగిన తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని పకోడీలు వేసి మీడియం ఫ్లేమ్‌లో బంగారు రంగు వచ్చే వరకు వేగించుకుంటే వేడీ వేడీ సేమియా పకోడీ రెడీ..