- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీ మండలిలో సెలక్ట్ కమిటీల ఏర్పాటు
శాసన మండలి సెలక్ట్ కమిటీలను చైర్మన్ షరీఫ్ ఏర్పాటు చేశారు. సీఆర్డీఏ రద్దు బిల్లు సెలక్ట్ కమిటీ చైర్మన్‌గా బొత్స సత్యనారాయణ, సభ్యులుగా టీడీపీ నుంచి ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, అర్జునుడు, రవిచంద్ర, శ్రీనివాసులు… వైసీపీ నుంచి మహ్మద్ ఇక్బాల్, పీడీఎఫ్ నుంచి వెంకటేశ్వరరావు, బీజేపీ నుంచి సోము వీర్రాజులను చైర్మన్ నియమించారు.
పరిపాలన వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీ చైర్మన్‌గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. సభ్యులుగా టీడీపీ నుంచి లోకేశ్, అశోక్‌బాబు, తిప్పేస్వామి, సంధ్యారాణి ఉండగా.. పీడీఎఫ్ నుంచి లక్ష్మణరావు, బీజేపీ నుంచి మాధవ్, వేణుగోపాల్‌రెడ్డి నియమితులయ్యారు.
అయితే సెలక్ట్ కమిటీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమంటూ మండలి చైర్మన్‌కు వైసీపీ లేఖ రాసింది. కమిటీల్లో తామూ భాగస్వాములము కాబోమని లేఖలో పేర్కొంది. మండలి చైర్మన్‌కు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పిల్లి సుభాష్, ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు లేఖ రాశారు. సెలక్ట్ కమిటీ ఏర్పాటు గడువు బుధవారం ముగిసింది. ఇప్పటికే ఆయా పార్టీలు సభ్యుల పేర్లను సూచిస్తూ.. లేఖలు ఇవ్వడంతో చైర్మన్ కమిటీలు ఏర్పాటు చేశారు. తన విచక్షణాధికారాలను ఎవరూ ప్రశ్నించలేరని ఈ సందర్భంగా చైర్మన్ షరీఫ్ వ్యాఖ్యనించడం గమన్హారం.