అశ్వాపురంలో మూడున్నర కేజీల గంజాయి పట్టివేత..

by Sridhar Babu |
అశ్వాపురంలో మూడున్నర కేజీల గంజాయి పట్టివేత..
X

దిశ, మణుగూరు : అశ్వాపురం మండలం కట్టవారి గూడెంలో 3.5 కేజీల గంజాయిని పట్టుకున్నామని అశ్వాపురం సీఐ సట్లరాజు తెలిపారు. శనివారం మండలంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఉన్నతాధికారులు ఆదేశాలు మేరకు ఎస్ఐ ఈ.రాజేష్ మండల కృష్ణ అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అతని కొడుకు సరోజిత్, బ్రహ్మణపల్లి సాయిరామ్ గంజాయితో వాళ్ల ఇంట్లో పట్టుకున్నామని తెలిపారు. వెంటనే గంజాయితో పాటు వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అనంతరం వారిని స్టేషన్ కి తీసుకువెళ్లి విచారించగా మండల కృష్ణ ఒడిశా నుంచి వచ్చి 30సంవత్సరాలుగా ఈ గ్రామంలో చేపల పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు.

ఈ క్రమంలో ఒడిశాలో ఇతనుకు పరిచయం ఉన్న శివోల్ అనే వ్యక్తి ద్వారా గంజాయి కొనుగోలు చేసి ఇక్కడ గ్రామస్థులకు అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నారని వివరించారు. వీరి వద్ద నుంచి 3.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి విలువ సుమారు 70.000 వేలు ఉంటుందని తెలిపారు. గంజాయితో పాటు 18000 వేల నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీన పరుచుకున్నామన్నారు. మండలంలో ఎంతటి వారైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వదిలిపెట్టేదిలేదని అటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోని క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ రాజేష్ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story