- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇసుక అక్రమ రవాణా.. 18 ట్రాక్టర్లు సీజ్
దిశ, బాన్సువాడ : కామారెడ్డి జిల్లా కిష్టాపూర్‌లో మంజీర నది నుంచి శనివారం తెల్లవారుజామున అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 18 ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్లు బాన్సువాడ రూరల్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల పేరిట కొందరు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారన్న పక్క సమాచారంతో దాడులు నిర్వహించినట్టు తెలిపారు. ఈ దాడుల్లో 18 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు వెల్లడించారు.
కొంత మంది అక్రమార్కులు బీర్కుర్, కిష్టాపూర్ మంజీర నదుల నుంచి ప్రతీ రోజూ.. అనుమతులు లేకుండా వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నా.. సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక పొతంగల్, బీర్కుర్, కిష్టపూర్, చించోలి, దమరంచా తదితర మంజీర పరివాహక ప్రాంతాల నుండి అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి.. వారికి అనువుగా ఉన్నచోట నిల్వచేసుకుంటున్నారు. అనంతరం బోధన్, నిజామాబాద్, వర్ని, బాన్సువాడ ప్రాంతాలకు రాత్రివేళల్లో టిప్పర్ల ద్వారా.. ఇసుక తరలించి లక్షలు గడిస్తున్నారనీ పలువురు బాహాటంగానే చెప్పుకుంటున్నారు.