గో హంగర్ గో.. ఛాలెంజ్ విసిరిన సీతక్క

by Shyam |
గో హంగర్ గో.. ఛాలెంజ్ విసిరిన సీతక్క
X

దిశ, వరంగల్: లాక్‌డౌన్ నేపథ్యంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆకలితో అలమటిస్తున్న నిరుపేదల కడుపు నింపేందుకు సరికొత్త కార్కక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గో హంగర్ గో అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ‘నేను మీ అందరికీ ఒక ఛాలెంజ్ చేస్తున్నాను, దాన్ని మీరు ఖచ్చితంగా స్వీకరించి పూర్తి చేసి మీ సోషల్ మీడియాలో GoHungerGo అని పోస్ట్ చేసి మీ తోటివారిని ఛాలెంజ్ చేస్తారని భావిస్తున్నాను’ అని తెలిపారు. ఇది పేద ప్రజల ఆకలిపై చేసే యుద్ధం, దయచేసి అందరూ దీంట్లో భాగం కండి అని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి పెద్ద దిక్కు అయిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, సోదరులు MP రేవంత్ రెడ్డి , షబ్బీర్ అలీ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి‌ని ఛాలెంజ్ చేసినట్టు ఆమె తెలిపారు.

Tags: MLA Seethakka, Go Hungry Go, Challenge, ts Congress leaders,tn governor

Advertisement

Next Story