- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేడారం సమ్మక్క సన్నిధిలో సీతక్క…
దిశ, వాజేడు : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ సంక్షేమ రాష్ట్రంగా విరాజిల్లుతుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సోమవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శించుకున్నారు. ‘సోదరుడు రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి దక్కాలని పలుమార్లు సమ్మక్క సారక్క వనదేవతలను మొక్కు కోవడం జరిగింది. అమ్మవార్ల దీవెన ఫలితంగా రేవంత్ రెడ్డి కి పీసీసీ పదవి దక్కింది’ అని ఆమె అన్నారు.
రాబోయే మేడారం జాతరలో భారీగా మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని గిరిజన ఆచార దైవమైన సమ్మక్క సారలమ్మ దీవెనలు ఎల్లవేళలా ఉంటాయని ఆమె అన్నారు.రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి దక్కడం హర్షణీయమని అంతర్గత వివాదాలు రాకుండా ప్రతి ఒక్కరూ ప్రజల సమస్యలను ఎజెండాగా తీసుకుని పోరాడినప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఏమైనా విభేదాలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి తప్ప ప్రజల్లోకి తీసుకు వచ్చి ప్రజలను అయోమయం చేయకూడదని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంతోనే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం ఏర్పడుతుందని ఆమె అన్నారు.
అందరూ కలిసికట్టుగా ఏకతాటిపై పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది కార్యకర్తలు నాయకులు రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి దక్కాలని కోరుకున్నారని, వారి కోరిక ఫలితంగా రేవంత్ రెడ్డికి పదవి దక్కిందని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఆమె కోరారు.