- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సదర్మాట్ ప్రాజెక్టును కేసీఆర్ మరిచారు: సీతక్క
X
దిశ, ఖానాపూర్: ఖానాపూర్, కడెం మండలాల్లోని రైతుల జీవనోపాధి అయిన సదర్మాట్ ప్రాజెక్టు మీద ప్రభుత్వం చిన్న చూపు చూపడం సరికాదని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఈ నెల 9న ఇంద్రవెల్లిలో దళిత దండోరా సభ ఉన్న నేపథ్యంలో కడం, ఖానాపూర్ మండలాల్లో ఆమె శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ పట్టణంలోని విశ్రాంతి భవనంలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టులు కట్టారని అన్నారు. కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కడెం, ఖానాపూర్ మండలంలోని రైతులను ముంచేశాడని విమర్శించారు. ఓట్ల కోసమే వాగ్దానాలు చేస్తూ.. కొత్త పథకాల ఆశ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పోడు భూముల విషయంలో గిరిజన, ఆదివాసి బిడ్డలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని.. వారి భూములకు పట్టా చేయించాలని సీతక్క డిమాండ్ చేశారు.
Advertisement
Next Story