- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీతమ్మసాగర్.. ముందుకు సాగేనా..?
దిశ, ఖమ్మం ప్రతినిధి: సీతమ్మ సాగర్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో ప్రస్తుతం ఉన్న కాటన్ ఆనక్టటకు 200 మీటర్ల దిగువన సమాంతరంగా ప్రభుత్వం నూతనంగా నిర్మించనున్న ఆనకట్ట దాదాపు రూ. 2600కోట్ల నిధుల అంచనాతో ఈ ప్రాజెక్టును నిర్మించ తలపెట్టింది. సుమారు 20మీటర్ల ఎత్తు వరకు నీటిని ఆపి 36 టీఎంసీలను నిల్వ చేయనున్నారు. మరి ఈ బ్యారేజీ నిర్మాణానికి కూడా ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 3500 ఎకరాల భూమి రైతులు కోల్పోవాల్సి వస్తుంది. ఇంత భారీ స్థాయిలో భూ సేకరణ చేస్తే స్థానికుల నుంచి వ్యతిరేకత మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే భూములివ్వాల్సి వస్తుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
సవాల్ గా సేకరణ..
ఇప్పటికే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని వందల ఎకరాల్లో భూ సేకకరణ పూర్తి కాగా.. ఇంకా చాలా వరకు మొదలవ్వనే లేదు.. ప్రాజెక్టు నిర్మాణానికి తమ విలువైన పంట భూములు ఇచ్చే ప్రస్తక్తే లేదని రైతులు, భూ నిర్వాసితులు చెబుతున్నారు. భూములు బలవంతంగా సేకరిస్తే ఆందోళనబాట పడుతామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీతమ్మసాగర్ కు సంబంధించి భూసేకరణ ప్రారంభమైనట్టు కూడా సమాచారం. దుమ్ముగూడెం, మణుగూరు, అశ్వాపురం మండలాల్లో భూసేకరణ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 3500 ఎకరాలు భూమి రైతులు కోల్పోవాల్సి వస్తుందని సమాచారం. ఇప్పటికే సుమారు 1100 ఎకరాల్లో భూ సేకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. నిర్వాసితులకు నష్టపరిహారం విషయమై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. గతంలో సేకరించిన భూమికి సంబంధించి చాలా వరకు నిర్వాసితులకు నష్టపరిహారం ఇంకా అందనే లేదు.. మరి సీతమ్మ సాగర్ కోసం స్వచ్ఛందంగా భూమి ఇస్తారా..? లేక బలవంతంగా తీసుకుంటారో చూడాలి మరి.
రైతుల ఆందోళనబాట
సీతారామా కోసం సేకరించిన భూమికి సంబంధించి నిర్వాసితులకు కొంత మందికి ఇప్పటికీ పరిహారం కానీ, ఎలాంటి హామీ కానీ ఇవ్వలేదు ప్రభుత్వం. దీంతోనే ఇప్పుడు సీతమ్మసాగర్ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. ఇటీవల సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు అడ్డుకుంటామంటూ చర్ల మండలం దేవరాయిపల్లి గ్రామం వద్ద నాలుగు గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయిండంతో భారీస్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములు ప్రాజెక్టు కోసం ఇవ్వమని స్పష్టం చేశారు.
నిర్వాసితుల ఆగ్రహం..
తమ బతుకులు ఆగమాగం చేసే సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను అడ్డుకుంటామని రైతులు హెచ్చరిస్తున్నారు. అన్నదాలకు సాయం చేయాల్సిన ప్రభుత్వం మోసం చేస్తోందంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే నాలుగు గ్రామపంచాయతీల్లో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేశామని, భవిష్యత్తులో తమకు జరిగే పూర్తి నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.