అడవుల పునరుద్ధరణ కోసం సీడ్ బాల్స్.. డ్రోన్‌లతో ప్లాంటేషన్

by Shyam |
అడవుల పునరుద్ధరణ కోసం సీడ్ బాల్స్.. డ్రోన్‌లతో ప్లాంటేషన్
X

దిశ, కామారెడ్డి: జిల్లా పరిధిలో క్షీణించిన అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరించడానికి విత్తన బాల్స్ ద్వారా చెట్ల పెంపకం చేపట్టామని కామారెడ్డి ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. గురువారం రాజంపేట మండలం పెద్దాయిపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో విత్తన బాల్స్ ద్వారా.. ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. డ్రోన్ సాయంతో సీడ్ బాల్స్‌ను పల్చగా ఉన్న ప్రాంతంలో వెదజల్లారు.

ఈ సందర్భంగా కామారెడ్డి ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సీడ్ బాల్స్ ద్వారా అటవీ ప్రాంతంలో విత్తనాలను వేసే కార్యక్రమాన్ని మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డిలు ప్రారంభించారని గుర్తు చేశారు. కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటి సారిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. గుబ్బ కోల్డ్ స్టోరేజ్, మారుత్ డ్రోన్స్ కంపెనీల ఆధ్వర్యంలో విత్తనాలు వేసే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed