- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ ఇల్లు ఆపిల్ మ్యాప్స్‌లో చూసుకోవచ్చు!
దిశ, ఫీచర్స్ : ఆపిల్ కంపెనీ రెండేళ్ల క్రితం నుంచి ఆస్ట్రేలియా వీధుల్లోని ప్రతీ చెట్టు, భవనం, వీధి మార్కింగ్‌లను సంగ్రహించేందుకు చిత్రాలు, త్రీ-డైమెన్షనల్ డేటాను రికార్డ్ చేయడం ప్రారంభించింది. దీంతో ప్రజెంట్ ఆస్ట్రేలియా అంతటా ఉన్న వందల వేల కిలోమీటర్ల రోడ్లను Apple మ్యాప్స్‌లో డీటెయిల్డ్‌గా అందిస్తుండటం విశేషం. అతిపెద్ద నగరాలతో పాటు చిన్న పట్టణాలకు చెందిన మరింత వివరణాత్మక నావిగేషన్, ఎక్స్‌ప్లోరేషన్‌తో ఆపిల్ ప్రపంచపు ‘అత్యుత్తమ మ్యాప్’గా నిలిచే దిశగా ముందుకు సాగుతోంది.
డిటేయిల్, ఏరియల్, స్ట్రీట్-లెవల్ చిత్రాలతో గూగుల్ మ్యాప్ అందరి మొబైల్స్‌లో డిఫాల్ట్ ఎంపికగా మారిపోయింది. మార్కెట్ లీడర్‌గా ఎదిగిన గూగుల్‌కు పోటీగా ఆపిల్ తమ మ్యాప్‌ను అంతకుమించిన ప్రొడక్ట్‌గా అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే నావిగేషన్, ఎక్స్‌ప్లోరేషన్‌ను మరింత గొప్ప అనుభవంగా మార్చేందుకు కొత్త ఫీచర్స్ జోడిస్తుంది. ఇప్పటి వరకు, మ్యాప్‌లలోని భవనాల 3D రిప్రజెంటేషన్ కేవలం ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితం కాగా ప్రస్తుతం చిన్న పట్టణాలకు కూడా మ్యాపింగ్‌ను విస్తరించింది. ఏరియల్ ఫొటోగ్రఫీ, మ్యాపింగ్‌తో పాటు ఆస్ట్రేలియాలోని ప్రతీ ఒక్క రహదారి నుంచి డేటా చిత్రాలను ఉపయోగించి.. చిన్న పట్టణాల్లోని ప్రతి భవనానికి సంబంధించిన 3D బ్లాక్స్‌కు స్థానం కల్పించింది.
స్పోర్ట్స్ స్టేడియమ్స్, పార్లమెంట్ హౌజ్‌తో పాటు 45 పాపులర్ బిల్డింగ్స్‌ను సూక్ష్మంగా సృష్టించిన 3D మోడల్స్‌ను కంప్యూటర్‌లో కాకుండా చేతితో గీయడం విశేషం. కొత్త మ్యాపింగ్ వ్యవస్థలో గోల్ఫ్ కోర్స్ ఫెయిర్‌వే కూడా మరింత వివరంగా కనిపిస్తున్నాయి. Mac నుంచి iPad, iPhone, Apple Watch వరకు అన్ని Apple పరికరాల్లో సరికొత్త Apple Maps ఆస్ట్రేలియా వాసులకు అందుబాటులోకి వచ్చింది.
ఇది ఉపగ్రహ చిత్రాల నుంచి మనం ప్రయాణించే విమానాల వరకు అన్నింటి కలయిక. ఇందుకోసం మెషీన్ లెర్నింగ్, ఏఐ సాంకేతికతను ఉపయోగించాం. 500 మీటర్లలో కుడివైపు తిరగండి అని చెప్పడానికి బదులుగా, మీరు తదుపరి ట్రాఫిక్ లైట్ల వద్ద కుడివైపు తిరగండి వంటి సూచనలు కూడా ఇందులో జతచేశాం. ప్రతి ఒక్క రహదారిని కవర్ చేయడంతో మీరు ఎక్కడికి వెళుతున్నారో చూడగలరు. అక్కడికి ఎలా చేరుకోవాలో ముందే మ్యాపింగ్ చేసుకోగలుగుతారు.
మిస్టర్ డోర్న్, ఆపిల్ మ్యాప్స్ ప్రొడక్ట్ టీమ్ లీడ్