- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కిమ్ మరణవార్తల వెనుక ఉన్న రహస్యమేంటో తెలుసా..?
ప్యాంగ్యాంగ్ :
ఉత్తర కొరియా అధ్యక్షుడు, సుప్రీంలీడర్ కిమ్ జోంగ్ ఉన్ చనిపోయాడంటూ వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. గత వారమే ఒక ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సమయంలో ప్రజలకు కనపడటంతో కిమ్ మరణ వార్తలకు తెరపడింది. అయితే, అసలు ఈ వార్తలు ఎవరు పుట్టించారు.. ఈ డ్రామాకు తెరలేపింది ఎవరు అనే విషయం తాజాగా వెల్లడైంది. ఉత్తర కొరియాకు చెందిన సీక్రెట్ సర్వీస్ ఆర్‌జీబీ ఈ నాటకానికి తెరలేపింది. ముందుగా అమెరికాకు చెందిన ప్రముఖ వార్త సంస్థ ప్రతినిధి ఒకరికి కిన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడనే వార్తను చేరవేసింది. దీంతో ఆ వార్తా సంస్థ ఏకంగా కిమ్ చనిపోయాడని వార్తలు కుమ్మరించింది. ఆ మీడియా సంస్థకు క్రెడిబిలిటీ ఉండటంతో మిగతా దేశాల మీడియా కూడా చిలువలు పలువలుగా చేసి వార్తలు రాశాయి. అసలు ఆర్‌జీబీ ఈ విషయం ఎందుకు లీక్ చేశాయని ఆరా తీయగా.. కిమ్ ఒక వేళ చనిపోతే దేశంలో ఎవరు కుట్రలకు పాల్పడతారు.. ఏ నాయకుడిని తన వారసుడిగా ప్రజలు ఆమోదిస్తారనే విషయాలను తెలుసుకోవడానికి ఈ నాటకం ఆడినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ నాటకం కారణంగా కిమ్‌కు చాలామంది కుట్రదారుల గురించి తెలిసిపోయిందంటా. నెమ్మదిగా వీరందరి భరతం పట్టేందుకు కిమ్ సిద్ధమవుతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. కిమ్ ఆడిన డ్రామా సీక్రెట్ సర్వీస్‌లోని ఒకరిద్దరి, అతని సన్నిహితులకు మాత్రమే తెలుసంట. ఆ నాటకం రక్తికట్టించడానికే కిమ్ ముఖ్యమైన తన తాతయ్య జయంతి ఉత్సవాలకు కూడా హాజరు కాలేదంట. అంతేకాదు, కిమ్ చనిపోతే దక్షిణ కొరియా ఏం చేస్తుంది..? అమెరికా, చైనాలు ఎలా స్పందిస్తాయనే విషయాన్ని కూడా ఆరా తీశాడట. ఇక అతనికి కావల్సిన సమాచారం అంతా రావడంతో తన మరణవార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేసి ప్రజల్లోకి వచ్చాడని సన్నిహితులు చెబుతున్నారు. ఏదేమైనా కిమ్ ఆలోచనలను పసిగట్టడం ఎవరి తరం కాదని మరోసారి రుజువైందని అంతర్జాతీయ మీడియా అంటోంది.
Tags: Kim Jong Un, Death, News, Secret, South Korea, North Korea