కరోనా రెండో వేవ్ దారుణంగా ఉండబోతోందా?

by vinod kumar |
కరోనా రెండో వేవ్ దారుణంగా ఉండబోతోందా?
X

దిశ, వెబ్‌డెస్క్: 1918లో స్పానిష్ ఫ్లూ పేరుతో ఒక మహమ్మారి విజృంభించింది. దాని మొదటి వేవ్‌లో 3-5 మిలియన్ల మంది చనిపోయారు. కానీ దాని రెండో వేవ్‌లో 20-50 మిలియన్ల మంది చనిపోయారు. ఏదో మొదటిసారి వచ్చినప్పుడు తనని హింసించినవాళ్ల రెండోసారి పెద్దమొత్తంలో ఇబ్బందిపెట్టడానికి వచ్చి పగతీర్చుకున్నట్లు స్పానిష్ ఫ్లూ విజృంభించింది. అయితే కరోనా విషయంలో కూడా ఇదే జరగనుందా?

యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాలోని సెంటర్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ రీసెర్చ్ అండ్ పాలసీ (సీఐడీఆర్ఏపీ) వారి నివేదిక ప్రకారం కరోనా వైరస్ దాదాపు రెండేళ్ల పాటు ఉంటుందని తేలింది. అయితే ఈ రెండేళ్ల గ్యాప్‌లో అది అన్ని రకాలుగా దాడి చేస్తుందోననే విషయం వాళ్లు కనిపెట్టలేకపోయారు. గత పాండమిక్‌ల దాడుల ప్రకారం ఒకసారి పోయిన పాండమిక్ మళ్లీ వచ్చిందంటే విధ్వంసం జరగొచ్చని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే స్పానిష్ ఫ్లూతో పోల్చినపుడు కరోనా ప్రభావం ఎక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక కరోనా రెండో వేవ్ వస్తే పరిస్థితేంటో ఊహించాలంటే గగుర్పాటు కలుగుతోంది.

ఇప్పటికే మొదలైందా?

దాదాపు రెండు నెలలుగా లాక్‌డౌన్‌‌లో ఉండటంతో చాలా సామాజిక సమస్యలు తలెత్తాయి. వాటిని ఎదుర్కునే పనిలో భాగంగా లాక్‌డౌన్ సడలింపులు చేశారు. ఆ సడలింపు చేసిన చోటల్లో ఒకటీ అర పాజిటివ్ కేసులు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది రెండో వేవ్‌కి సంకేతమా అని నిపుణులు సందేహిస్తున్నారు. కానీ సరైన సామాజిక దూరం, నిబంధనలు పాటిస్తే ఈ రెండో వేవ్‌ని కూడా తట్టుకోవడం సులభమేనని వారు అంటున్నారు. అంతేకాకుండా ఇప్పటికే కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్ లేదా మందు కనిపెట్టే ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అవే గనక త్వరగా పూర్తయ్యి ఒక మందు బయటికి వచ్చేస్తే ఒకటి కాదు రెండు కాదు కరోనాను నామరూపాలు లేకుండా చేసే అవకాశం కూడా దొరుకుతుంది. ఏదేమైనా ప్రస్తుతానికి ఇంట్లో కూర్చొని ప్రపంచ రక్షణలో మనం కూడా ఒక భాగమవడం తప్ప వేరే పనేం లేదు.

Tags: corona, second wave, covid, spanish flu, pandemic, lockdown, vaccine

Advertisement

Next Story