- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐపీఓ నిబంధనలను కఠినతరం చేసిన సెబీ!
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల భారీ సంఖ్యలో ఐపీఓలు వస్తున్న తరుణంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మంగళవారం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. పలు సవరణ లతో పాటు ఐపీఓ నిబంధనలు కఠినతరం చేస్తున్నట్టు తెలిపింది. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, మ్యూచువల్ ఫండ్, సెటిల్‌మెంట్ ప్రొసీడింగ్ నిబంధనలను సవరించింది. అలాగే ట్రేడింగ్ నిబంధనలు మారుస్తూ, ఐపీఓ నుంచి సమీకరించిన నిధుల వినియోగంపై సెబీ పరిమితులు విధించింది. కొత్తగా లిస్టింగ్ అయిన కంపెనీ లో 20 కంటే ఎక్కువ వాటా ఉన్న పెట్టుబడిదారులు తమ హోల్డింగ్ నుంచి వైదొలడాన్ని సెబీ నిషేధించింది. అందుకు బదులు మొత్తం షేర్లలో 50 శాతం విక్రయించవచ్చు.
కొత్తగా స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన కంపెనీలు నష్ట పోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెబీ వివరించింది. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధుల్లో 25 శాతం మాత్రమే ఇతర కార్యక్రమాలకు ఉపయోగించాలని స్పష్టం చేసింది. రిటైల్ ఇన్వెస్టర్ల నష్టాలను నివారించేందుకు యాంకర్ ఇన్వెస్టర్ల లాక్-ఇన్ వ్యవధిని 30 రోజుల నుంచి 90 రోజులకు పెంచింది. లిస్టింగ్ అయిన కంపెనీలు సెబీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, ఏదైనా సంస్థకు 5 శాతం కంటే ఎక్కువ షేర్లు కేటాయిస్తే విలువ ఆధారిత(వాల్యూయేషన్) రిపోర్ట్ అందించాలి. ప్రైస్ బ్యాండ్‌లో ఫ్లోర్ ప్రైస్‌కు అప్పర్ ప్రైస్‌కు 105 శాతం వ్యత్యాసం ఉండేలా సెబీ సవరించింది.