- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టి. కన్సల్ట్‌కు స్కోచ్ అవార్డు
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) అనుబంధ డిజిథాన్ మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. కరోనా వైరస్ విజృంభణ సమయంలో రూపొందించిన టి.కన్సల్ట్యాప్ ద్వారా మక్తల్నియోజకవర్గంలో అందించిన ఉచిత ఆన్‌లైన్ వైద్య సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా 20వేల ఆన్‌లైన్ కన్సల్టెషన్లు పూర్తి చేసి పల్లె జనానికి అందించిన సేవలను ప్రత్యేకంగా జ్యూరీ ప్రశంసించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన 69వ స్కోచ్ సమ్మిట్‌లో నారాయణపేట్ జిల్లా కలెక్టర్ డి. హరిచందన ఈ అవార్డును స్వీకరించారు. లాక్‌డౌన్ సమయంలో వైద్య సేవలు పొందేందుకు ఇబ్బందులు పడిన ప్రజలను టీటా గుర్తించింది. వైద్య సేవల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి టీ కన్సల్ట్యాప్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో కన్సల్టేషన్ సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. మండలంలోని 39 గ్రామాల్లో నారాయణపేట కలెక్టర్ హరిచందన, టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 8వ తేదీన ప్రారంభించారు. టెలీ మెడిసిన్ రంగంలో టి కన్సల్ట్ద్వారా అందించిన ఈ వైద్య సేవలకు జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు దక్కింది. ఎక్సలెన్స్ ఇన్ రెస్పాన్స్ టు కోవిడ్ కేటగిరీలో కరోనా సమయంలో చేసిన కృషికి అవార్డు దక్కింది.