- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లోపలి అవయవాలను అంటించే ప్లాస్టర్
బయటి గాయాలకు కుట్టు వేయడం లేదా బ్యాండ్ ఎయిడ్ వేయడం ద్వారా నయం చేసుకోవచ్చు. కానీ శరీరం లోపలి గాయాలకు కుట్లు వేయడం, మళ్లీ వాటిని తీయడం కొద్దిగా కష్టమే. మరీ ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు వంటి అవయవాలకు ఆపరేషన్ చేసి కుట్లు వేయడం చాలా కష్టం. ఏ చిన్న తప్పు జరిగినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆ సున్నిత అవయవాల కోసం ప్రత్యేకంగా మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ వారు ఒక ప్లాస్టర్ లాంటి బ్యాండ్ ఎయిడ్ తయారు చేశారు. గతేడాది తయారు చేసిన ఈ ప్లాస్టర్ సాయంతో తడిగా ఉండే జీవఉపరితల కణజాలాలను ఒకదానితో ఒకటి అంటించవచ్చు. గాయం వద్ద ఈ ప్లాస్టర్‌ను అంటిస్తాం సరే.. ఒకవేళ తప్పుగా అంటిస్తే పరిస్థితి ఏంటి? మళ్లీ తీసి అంటించలేనంత సున్నితమైన అవయవాలు కాబట్టి కేవలం అతికించడమే కాదు, తీయడం కూడా సులభతరం చేసేలా ఈ ఏడాది అదే ప్లాస్టర్ బ్యాండ్ ఎయిడ్‌కు మెరుగులు దిద్దారు.
ముందు ప్లాస్టర్ అంటించి, దాని మీద ప్రత్యేకంగా తయారు చేసిన ఒక ద్రవాన్ని పోయడం ద్వారా సులభంగా తీయవచ్చు. కాబట్టి సర్జరీ సమయంలో ప్లాస్టర్ అంటించి, గాయం నయమైన తర్వాత బ్యాండ్ ఎయిడ్ తీసేసే సౌకర్యం కలుగుతోంది. అంతర్గత అవయవాలకు ఈ నొప్పి కలిగించని బ్యాండ్ ఎయిడ్ వల్ల మెడికల్ సర్జరీల్లో చాలా మార్పులు తీసుకురావొచ్చని ప్రొఫెసర్ గ్జువాన్ హే జావో తెలిపారు. కావాల్సినపుడు అంటించుకుని వద్దనుకున్నపుడు ఈ ప్లాస్టర్ బ్యాండ్ ఎయిడ్‌ను తొలగించుకోవచ్చని ఆయన అన్నారు. సాధారణంగా తడి ప్రదేశాల్లో ఎలాంటి పదార్థాలు అతుక్కోవు కాబట్టి పాలీఎక్రిలిక్ యాసిడ్ ఉపయోగించి తాము ఈ ప్లాస్టర్ తయారుచేసినట్లు జావో వివరించారు. డైపర్లలో ఉపయోగించే ఈ యాసిడ్.. ముందుగా తడిదనాన్ని పీల్చుకుని ఆ తర్వాత అక్కడ హైడ్రోజన్ బంధాలను ఏర్పరచి రెండు తలాలను గట్టిగా అంటిస్తుందని ఆయన చెప్పారు. గతంలో ఈ ప్లాస్టర్‌ను అంటించి మళ్లీ తీసేటపుడు కొద్దిగా గాయం అయ్యేదని, ఆ గాయం ఇన్‌ఫెక్షన్‌గా మారి ప్రాణాలకు ప్రమాదం కలిగించేదిగా ఉండటంతో ప్లాస్టర్‌ను తీయడానికి ఒక ద్రవం అభివృద్ధి చేసినట్లు జావో అన్నారు. ఈ ద్రవం పోయగానే ప్లాస్టర్ జెల్ రూపంలోకి మారి, సులభంగా తీయడానికి వీలు కలుగుతోందని ఆయన అన్నారు.