- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీలో మోగిన బడిగంట.. ఆదేశాలు ఇవే
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు పున: ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో పాఠశాలలు మూసివేయబడ్డాయి. అయితే సెకండ్ వేవ్ అనంతరం పటిష్టమైన భద్రత నడుమ పాఠశాలలను రీ ఓపెన్ చేశారు. కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ 1 నుంచి 10 తరగతులు, ఇంటర్ రెండో ఏడాది వారికి తరగతులు నిర్వహించనున్నారు. విద్యార్థులు, సిబ్బంది వైరస్ బారిన పడకుండా ఉండేలా విద్యా శాఖ జాగ్రత్తలు తీసుకుంది. ప్రతీ పాఠశాలలో కొవిడ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) అమలుకు వీలుగా ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాలలను విద్యాశాఖ తెరిచింది.
మార్గదర్శకాలు ఇవే..
‘ప్రతి తరగతి గదిలో 20 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి. విద్యార్థులు తమ తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితోనే పాఠశాలకు హాజరుకావాలి. విద్యార్థులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. పాఠశాలలో ఖచ్చితంగా శానిటైజేషన్ అమలు చేయాలి. పాఠశాలల సమయంలో ఎలాంటి మార్పులు లేవు. ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రతిరోజూ స్కూళ్లకు హాజరుకావాల్సిందే. పిల్లల సంఖ్యకు తగినమేర వసతి లేని పక్షంలో తరగతులను రోజు విడిచి రోజు నిర్వహించాలి’ అని ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే విద్యార్థులు పాఠశాలలోకి ప్రవేశించే ముందు వారికి థర్మల్ స్క్రీనింగ్ చేయాలని ఆదేశించింది.
విద్యాశాఖ కీలక ఆదేశాలు..
పాఠశాలలు తెరుస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ సైతం ఆయా పాఠశాలల హెచ్ఎం, ప్రిన్సిపాళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించింది. అలాగే విద్యార్థులలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే వారికి పరీక్ష చేయించడం..ఒకవేళ కరోనా సోకితే వారికోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించాలని పేర్కొంది. మరోవైపు వృద్ధులు, రోగులు ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంటివద్దనే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. తరగతి గదిలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు చేయించారు.
మరోవైపు మధ్యాహ్నా భోజన సమయంలో తరగతుల వారీగా భోజనం అందించాలని విద్యాశాఖ సూచించింది. అలాగే స్కూలు విడిచిపెట్టే సమయంలో కూడా అందర్నీ ఒకేసారి కాకుండా 10 నిమిషాల గ్యాప్ ఇచ్చి వదలాలని ఆదేశించింది. కొవిడ్ నిబంధనలపై విద్యార్థులకు తరగతి గదిలో అవగాహన కల్పించాలని ఆదేశించింది. విద్యార్థులు ఇంటికి వెళ్లిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయడమో లేదా చేతులు కడుక్కొని మాత్రమే ఇళ్లలోకి ప్రవేశించేలా అవగాహన కల్పించాలి. స్కూలు అసెంబ్లీ, గ్రూప్ డిస్కర్షన్స్, క్రీడలు నిర్వహించరాదని సూచించింది.
నేటి నుంచి జాతీయ విద్యావిధానం అమలు..
ఈ ఏడాది నుంచి జాతీయ విద్యావిధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సోమవారం నుంచి నూతన విద్యావిధానం అమలులోకి రానుంది. పాఠశాల విద్యావ్యవస్థను ప్రభుత్వం ఆరు రకాలుగా విభజించింది. ప్రస్తుతమున్న 10+2 విధానం స్థానంలో 5+3+3+4 విధానం అమల్లోకి రానుంది. శాటిలైట్ ఫౌండేషన్‌కు బదులుగా పూర్వ ప్రాథమిక విద్య 1, 2.. ప్రీప్రైమరీ 1, 2 సహా ఒకటి, రెండు తరగతులు ఉంటే ఫౌండేషన్.. 1 నుంచి 5 తరగతులు ఉంటే ఫౌండేషన్ ప్లస్..3 నుంచి 8వ తరగతి వరకు ఉంటే ప్రీ హైస్కూళ్లు, 3 నుంచి 10వ తరగతి వరకు ఉంటే హైస్కూళ్లు, 3 నుంచి 12 వరకు ఉంటే హైస్కూల్ ప్లస్‌గా మార్చారు. అలాగే ఇకపై అంగన్‌వాడీ కేంద్రాలు వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా పనిచేస్తాయి.
ఇకపోతే ఫౌండేషన్ స్కూల్‌లో ఒక ఎస్జీటీ టీచర్.. 1, 2 తరగతులకు బోధన చేస్తారు. ప్రిపరేటరీ-1 క్లాస్‌కు బోధనా సిబ్బందిని వేరుగా ఏర్పాటు చేస్తారు. టీచర్, విద్యార్థుల నిష్పత్తి ప్రాథమిక స్థాయిలో 1:30, మాధ్యమిక స్థాయిలో 1:35, సెకండరీ స్థాయిలో 1:40 ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.